లాక్‌డౌన్‌ మరో 28 రోజులు పొడిగిస్తే మంచిది!

6 Apr, 2020 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: యావత్‌ భారతం 21 రోజుల లాక్‌డౌన్‌తో ప్రాణాంతక కరోనాపై పోరాడుతోంది. ఇదీ, అదీ అని కాకుండా అన్ని రంగాలు లాక్‌డౌన్‌తో దెబ్బతో కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితిలోకి జారుకుంటోంది. అయితే, లాక్‌డౌన్‌ మరో తొమ్మిది రోజుల్లో ముగియనున్న క్రమంలో ఓ స్టడీ కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుత లాక్‌డౌన్‌​ కాలాన్ని మరో 28 రోజులు పొడిగించాలని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌ విభాగం పరిశోధకులు ఆర్‌.అధికారి, రాజేష్‌ సింగ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌-19 కట్టడికి 21 రోజుల లాక్‌డౌన్‌ సరిపోదని వారు అభిప్రాయపడ్డారు. మార్చి 25న ప్రధాని పిలుపునిచ్చిన లాక్‌డౌన్‌ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. లాక్‌డౌన్‌ పరిస్థితులపై తమ అధ్యయనంలో నాలుగు అంశాలను వెల్లడించారు.
(చదవండి: సిగరెట్‌ కోసం బయటకు.. రూ.11వేల ఫైన్‌)

 • మొదటిది.. 
  21 రోజుల లాక్‌డౌన్‌తో వైరస్‌ బారిన పడేవారి సంఖ్య తగ్గింది. అయితే, రోజురోజుకీ కేసుల పెరుగుదల చూస్తే ఇది పూర్తిగా సఫలం అయిందని అని చెప్పలేం. ప్రస్తుత లాకౌడౌన్‌ను తొలగించగానే వైరస్‌ విజృంభణ తీవ్రమవుతుంది.
 • రెండోది..
  ప్రస్తుత లాక్‌డౌన్‌కు 5 రోజుల పాటు విరామమిచ్చి 28 రోజలు పాటు మరో లాక్‌డౌన్‌ను ప్రకటించడం. ఇది కూడా కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పలేం.

 • మూడోది.. 
  ఇది మూడు లాక్‌డౌన్‌లను సూచిస్తుంది. మొదటిది 21 రోజులు.. అనంతరం ఐదు రోజుల విరామం.. మళ్లీ 28 రోజుల లాక్‌డౌన్‌.. 5 రోజుల విరామం.. చివరగా 18 రోజుల లాక్‌డౌన్‌. ఇలా చేస్తే వైరస్‌ సంక్రమణ కేసుల్ని పదుల సంఖ్యలోనే కట్టడి చేయొచ్చు.
 • నాలుగోది..
  చివరిది. కానీ ముఖ్యమైంది. ఏకధాటిగా ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలాన్ని 49 రోజులకు పొడిగించడం. దీనివల్ల కూడా వైరస్‌ సంక్రమణను అడ్డుకోవచ్చు. పదుల సంఖ్యకే కేసులను పరిమితం చేయొచ్చు. 


(చదవండి: త‌మిళ‌నాడులో ముగ్గురు మందుబాబుల మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు