సడలింపులకు గ్రీన్‌ సిగ్నల్‌

19 May, 2020 17:22 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో కరోనా వైరస్‌​ విజృంభిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ 4:0 నిబంధనలకు అనుగుణంగా పలు రంగాల్లో సడలింపు ఇస్తూనే కంటైన్‌మెంట్‌ జోన్లలో కఠిన ఆంక్షలను కొనసాగించాలని ముఖ్యమం‍త్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున మాల్స్‌, సినిమా థియేటర్స్‌, హోటల్స్‌, మెట్రో సేవలను ఆంక్షలు కొనసాగుతాయని మహారాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. రాష్ట్రంలో వైరస్‌ విజృంభిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు సడలింపులు తప్పవని భావించిన ప్రభుత్వం, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుకూ అనుమతినిచ్చింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు)


రాష్ట్ర వ్యాప్తంగా వీటిపై నిషేధం..

  • దేశీయ విమాన సర్వీసులు
  • మెట్రో సేవలు
  • పాఠశాలలు, కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థలు
  • హొటల్స్‌, రెస్టారెంట్స్‌, క్రీడా ప్రాంగణాలు
  • సినిమా, మాల్స్‌, జిమ్‌ సెంటర్స్‌, ఆడిటోరియమ్స్‌, స్విమ్మింగ్‌​ ఫూల్స్‌
  • అన్ని రకాల ర్యాలీలు, మత పరమైన సమావేశాలు, ప్రార్థనా మందిరాలు

 రెడ్‌జోన్లో మినహాయింపులు

  • లిక్కర్‌ షాపులు (పరిమితులకు లోబడి)
  • నిర్మాణ రంగ పనులు
  • ప్రభుత్వ కార్యాలయాలు
  • ఈ- కామర్స్‌ కార్యకలాపాలు
  • టాక్సీలు, రిక్షాలుకు అనుమతి లేదు

ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లో మినహాయింపులు

  • పబ్లిక్‌, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుకు అనుమతి
  • 50శాతం ప్రయాణికులతో బస్సులు
  • అన్ని రకాల మార్కెట్లు, షాపులు కూడా తెరుచుకోబడతాయి
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఓపెన్‌ 

కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

మరిన్ని వార్తలు