సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

22 Apr, 2020 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారతప్రభుత్వం మార్చి 24 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలని అనేక రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యలో ఏప్రిల్‌ 14 తో ముగియాల్సి ఉన్న లాక్‌డౌన్‌ను మే3 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రధాని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

(లాక్డౌన్: వార్తలో నిజం లేదు)

ఈ క్రమంలో ఏప్రిల్‌  27న ప్రధాని నరేంద్ర మోదీ..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలుతున్న తీరుతో పాటు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రధాని చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రులతో ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. పలు ఆంశాలపై చర్చించారు. వైరస్‌ కట్టడికి అవలంభించాల్సిన చర్యలపై సీఎంలనుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. మే3 వరకు రెండో విడత లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది. 

(అమ్మో అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ....)

>
మరిన్ని వార్తలు