బయోగ్యాస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన

1 Apr, 2016 04:58 IST|Sakshi

హొసూరు: హొసూరు మున్సిపల్ పరిధిలోని చెత్తా చెదారాన్ని సేకరించి దాసరపల్లి వద్ద బయోగ్యాస్ పథకాన్ని ఏర్పాటు చేయడాన్ని  వేరేచోటుకు మార్చాలని డిమాండ్ చేస్తూ దాసరపల్లి గ్రామస్థులు గురువారం బయోగా్‌‌యస్ ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. దాసరపల్లి వద్ద చెత్తాచెదారాన్ని సేకరించి వేయడంతో దాసరపల్లి, పెద్ద దిన్నూరు, ఆలూరు, దిన్నూరు, కొత్తూరు, బెగ్గిలి, ఇమ్మినపల్లి, గొల్లపల్లి తదితర 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ గ్రామాలలో నివశిస్తున్న 5 వేల మంది పలు శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులకు గురవుతున్నారు. దాసరపల్లి వద్ద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ 10 గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బయోగ్యాస్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు  నడుస్తున్నదని పేర్కొన్నారు. అధికార్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ 50 మంది గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు