డీఎంకేలోకి మళ్లీ అళగిరి?

1 Jan, 2016 09:21 IST|Sakshi
డీఎంకేలోకి మళ్లీ అళగిరి?

కుటుంబీకుల ఒత్తిడి
కరుణ అంగీకరించినట్టు సమాచారం
కొత్త ఏడాదిలో కింగ్ మేకర్ రీ ఎంట్రీ అవకాశం
 
చెన్నై : డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి మళ్లీ రీ ఎంట్రీకి మార్గం సుగమం అవుతున్నట్టుంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, ఆయన్ను మళ్లీ ఆహ్వానించేందుకు కుటుంబీకులు అధినేత ఎం కరుణానిధి మీద ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో  కొత్త ఏడాదిలో ఈ కింగ్ మేకర్ మళ్లీ రీ ఎంట్రీ కాబోతున్నట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు ఎంకే అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. యూపీఏ హ యాంలో ఎంపీగా, కేంద్ర కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించినా తన దృష్టిని అంతా రాష్ట్రం మీదే అళగిరి కేంద్రీకరించే వారు.
 
ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని పార్టీ వర్గాలు తన చేతి నుం చి జారీ పోకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే, తన  కోటలో ఆయన  సోదరుడు, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ క్రమంగా  పాగా వేయడం మొదలెట్టడంతో అళగిరి బహిరంగ యుద్దానికి ది గారు. అన్నదమ్ముళ్ల మధ్య ఏళ్ల తరబడి చాప కింద నీరులా  సాగుతూ వచ్చిన వారసత్వ సమరం ఈ పరిణామాలతో డీఎంకేలో పెను కలకలాన్ని సృష్టించిం దని చెప్పవచ్చు. అళగిరి తీరుపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. డీఎంకే బహిష్కృత నేతగా ముద్ర పడ్డ ఎంకే అళగిరి తదుపరి తన వేగాన్ని పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు.
 
ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో డిఎంకేను చావు దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తదుపరి పరిణామాలతో వెనక్కి తగ్గిన అళగిరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేందుకు యత్నిం చారు. పలు మార్లు తన తండ్రి, అధినేత కరుణానిధి కలిసేందుకు యత్నించినా అనుమతి దక్కలేదు. చివరకు మౌనంగా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన అళగిరి గత కొంత కాలంగా మీడియాకు దూరంగానే ఉం టూ వస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో అసెం బ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే , అళగిరి సేవల్ని మళ్లీ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
తమతో దోస్తికి ప్రధాన పార్టీలు కలిసి రాని దృష్ట్యా, ఒక వేళ కాంగ్రెస్ వస్తేకలుపుకోవడం లేదా , ఒంటరిగా నైనా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు అధినేత కరుణానిధి వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో అళగిరి వెన్నం టి ఉంటే, దక్షిణ తమిళనాడులో కొంత మేరకు లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని పలువురు కరుణానిధి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇదే విషయాన్ని కుటుంబీకులు సైతం కరుణానిధి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
కుటుంబీకులు ఒత్తిడి, తాజా పరిణామా ల్ని పరిగణలోకి తీసుకున్న కరుణానిధి అళగిరిని ఆహ్వానించేందుకు అంగీకా రం తెలిపినట్టు సమాచారం. దళపతి స్టాలిన్‌తో అంగీకరించినట్టు, చివరకు కరుఔ తుది నిర్ణయానికే కట్టుబడుతాననని తేల్చినట్టు సమాచారం. కరుణ తీసుకునే  ఏ నిర్ణయాని కైనా కట్టుబడే మనస్తత్వం స్టాలిన్‌దని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు