అద్దె చెల్లించలేదని నటుడికి నోటీసులు

16 Jun, 2015 11:15 IST|Sakshi
అద్దె చెల్లించలేదని నటుడికి నోటీసులు

బెంగళూరు : ఇంటి అద్దె చెల్లించకపోవటంతో కన్నడ నటుడుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే కన్నడ యువ నటుడు యశ్ నాలుగేళ్లుగా తన ఇంట్లో అద్దెకు ఉంటూ... అద్దె ఇచ్చేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇంటి యజమాని డాక్టర్ మునిప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కత్రిగుప్పెలో ఉంటున్న తన ఇంటిలో కొంతభాగాన్ని నటుడు యశ్ కు నాలుగేళ్ల క్రితం అద్దెకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

 

అయితే 2013 నుంచి యశ్ అద్దె ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ మునిప్రసాద్ సోమవారం కోర్టును ఆశ్రయించారు. రూ.21.37 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. దాంతో కోర్టు నోటీసులు జారీ చేసి యశ్ కుటుంబం శనివారం న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా అద్దె బకాయిలపై  మునిప్రసాద్ తంలోనే  గిరినగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

యశ్ వివరణ: ఓ ఏడాది నుంచి ఇంటి అద్దె చెల్లించడం లేదని, యశ్తో పాటు అతని తల్లి పుష్ప అంగీకరించారు. ఇంటి యజమాని కన్నడిగులకే అవమానం చేశారని, అందుకే తాము అద్దె చెల్లించడం నిలిపివేశామన్నారు.  మునిప్రసాద్ ఇతర భాషలో తమను తిడుతున్నారని తెలిపారు.  అయితే అద్దె చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే అద్దె తీసుకునేందుకు మునిప్రసాద్ నిరాకరిస్తున్నారని, ఇప్పటికూ ఇంటికి వచ్చి అద్దె తీసుకు వెళ్లవచ్చని యశ్ తల్లి పుష్ప తెలిపారు.

మరిన్ని వార్తలు