కోట్లకు అధిపతి కాకూడదా?

7 Nov, 2015 10:16 IST|Sakshi

నగర కార్యదర్శి, నగర పాలక సంస్థ చైర్‌పర్సన్లు వంద కోట్ల మేరకు ఆస్తి కలిగి ఉంటే తమ అధినేత్రి  జయలలిత కోట్లకు అధిపతి ఎందుకు కాకూడదంటూ మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అవినీతి తాండవం చేస్తోందని, ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నాయి.

కొన్ని పార్టీలు ఏకంగా మంత్రులు ఏ మేరకు అక్రమార్జన సాగిస్తున్నారో చిట్టాలను సైతం ప్రకటిస్తూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు అయితే ఫలాన అధికార పక్షం నేతకు వద్ద ఇన్ని కోట్లు ఉన్నాయని, ఫలాన నేత ఈ నాలుగేళ్లలో ఇన్ని కోట్లు సంపాదించాడని ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో బాధ్యత కల్గిన పద విలో ఉన్న మంత్రి ఏకంగా ప్రతిపక్షాల ఆరోపణల్ని సమర్థించే రీతిలో కోట్లు, అధిపతి అంటూ ప్రస్తావించడం అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. గుడియాత్తంలో అన్నాడీఎంకే సర్కారు నాలుగున్నరేళ్ల ప్రగతిని చాటుతూ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

 గుడియాత్తం నగర కార్యదర్శి జెకేఎన్ పళని నేతృత్వంలో అక్కడి బస్టాండ్ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ హాజరయ్యారు. కేసీ వీరమణి మాట్లాడుతూ గుడియాత్తం నగర పార్టీ కార్యదర్శి జేకే ఎన్ పళని, నగర చైర్ పర్సన్ అముదాలు వంద కోట్ల ఆస్తిపరులుగా పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కార్యదర్శి, చైర్‌పర్సన్లే వంద కోట్ల ఆస్తి పరులుగా ఉంటే తమ అధినేత్రి, అమ్మ జె జయలలిత కోట్లకు అధిపతిగా ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఇంతలో నాంజిల్ సంపత్ అందుకుని వంద కోట్ల ఆస్తి పరుడు ఇక్కడ కార్యదర్శిగా పార్టీకి సేవల్ని అందించడం బట్టి చూస్తే ఏ మేరకు వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కేసీ వీరమణి వ్యాఖ్యలను అన్నాడీఎంకే వర్గాలు తీవ్రంగా పరిగణిం చాయి. ఈ వ్యాఖ్యలపై అమ్మ ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో అతనిపై చర్యలు తప్పవని అంటున్నారు.

మరిన్ని వార్తలు