వినోదంగా సవాలే సమాళి

8 Mar, 2015 01:37 IST|Sakshi
వినోదంగా సవాలే సమాళి

ఇవాళ మినిమం గ్యారెంటీ చిత్రాలంటే హాస్యభరిత చిత్రాలే. సగటు ప్రేక్షకుడు ఈ తరహా చిత్రాలనే కోరుకుంటున్నారు. దీంతో జనం మాటే సినిమా బాట కాబట్టి అధిక భాగం సినీ దర్శక నిర్మాతలు హాస్యంతో కూడిన చిత్రాలనే నిర్మించడం మొదలెట్టారు. ఆ కోవలో వస్తున్న తాజా చిత్రం సవాలే సమాళి. అశోక్ సెల్వన్, బిందుమాధవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు అరుణ్ పాండియన్ సమర్పణలో ఎ అండ్ పి గ్రూప్స్ పతాకంపై కవితా పాండియన్, ఎస్ ఎన్ రేజరాజన్ నిర్మిస్తున్నారు. జగన్, నాజర్, ఊర్వశి, కరుణాస్, స్వాతి, గంజా కరుప్పు, ఎం ఎస్ భాస్కర్, మనోబాలా, ప్రీతిదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను సత్యదేవ నిర్వహిస్తున్నారు.
 
 చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ తన తొలి చిత్రం కళగు, మలి చిత్రం సివప్పులు ఎలా వైవిధ్య భరిత కథ చిత్రాల్లో ఈ సవాలే సమాళి వాటికి పూర్తి భిన్నంగా వినోదమే ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం అన్నారు. చిత్రంతో ప్రేమ నుంచి చివరి ప్రేమ వరకు హాస్యపు జల్లులు కురిపించే కథ, కథనాలతో ఈ చిత్రం ఉంటుందన్నారు. ఎలాంటి గుర్తింపు లేని ఒక టీవీ ఛానల్‌లో హీరో అశోక్ సెల్వన్, అతని స్నేహితుడు జగన్ పని చేస్తుంటారన్నారు. ఆ ఛానల్‌కు ఎలాంటి అభివృద్ధి లేకున్నా వీరిద్దరూ జాలీగా గడిపేస్తుంటారన్నారు. అయితే ఆ ఛానల్ డెవలప్‌మెంట్ కోసం వీరు చేసే కృషి పలించి ఛానల్ ఓహో అని వెలిగిపోతుందన్నారు. అయితే ఆ కారణంగా ఈ మిత్రద్వయానికి సమస్యలు తలెత్తుతాయన్నారు. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ఇతివృత్తంగా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు