తెలంగాణ ఇస్తే చూస్తూ ఊరుకోం: టీజీ వెంకటేష్

29 Jun, 2013 00:54 IST|Sakshi
తెలంగాణ ఇస్తే చూస్తూ ఊరుకోం: టీజీ వెంకటేష్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని హైకమాండ్‌కు చెబుతామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వస్తున్న వార్తలన్ని ఊహాగానామేనని ఆయన అన్నారు. వచ్చే జూన్1న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసి.. రాష్ట్ర విభజన అంశంపై చర్చించస్తామన్నారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో  సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడారు. 
 
తెలంగాణ ఇస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి టీజీ వెంకటేష్‌ హెచ్చరించారు. 2009 లాగానే తెలంగాణను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ వారివి కడుపునిండిన మాటలు అని మంత్రి టీజీ వెంకటేష్‌ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇదే సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా సభలు పెట్టి సమైక్యవాదాన్ని వినిపిస్తాం అని అన్నారు. ఢిల్లీ పరిణామాలను గమనిస్తున్నామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే మా నిర్ణయం అని మంత్రి గంటా స్పష్టం చేశారు. 
మరిన్ని వార్తలు