మంచంపట్టిన బోడగుట్టపల్లి

15 Oct, 2016 12:09 IST|Sakshi
 నెల రోజుల్లో రెండోసారి ప్రబలిన విషజ్వరాలు 
 ముగ్గురికి డెంగీ లక్షణాలు 
 తాజాగా 20 మందికి జ్వరం 
 ఆందోళనలో గ్రామస్తులు
 మొక్కుబడిగా వైద్యశిబిరాలు
 తూతూమంత్రంగా పారిశుధ్య పనులు 
 
బసంత్‌నగర్ : పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుట్టపల్లి మళ్లీ మంచంపట్టింది. గ్రామంలోని బీసీ కాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నారుు. తాజాగా 20మంది జ్వరంతో బాధపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జ్వరాలు విజృంభిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన గణపతి అనసూర్యకు పది రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు.  అరుునా తగ్గకపోవడంతో గోదావరిఖని, పెద్దపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స  చేయించారు. ఫలితం లేకపోవడంతో కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు.
 
వారం రోజుల చికిత్స అనంతరం రెం డు రోజుల క్రితం అనసూర్యను వైద్యులు  ఇంటికి పంపించారు. గత నెలలో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ మల్లేశం, బీసీ కాలనీకి చెందిన పూరెళ్ల రాజు కూడా డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. పది రోజలు కరీంనగర్‌లో చికిత్స పొందారు. నెలరోజుల్లో గ్రామంలో సుమారు 50 మంది జ్వరంతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో ముగ్గురు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అరుుంది. నెల రోజులైనా గ్రామాన్ని జ్వరాలు వీడకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో కన్నాల ఎస్సీ కాలనీకి చెందిన ఎల్కటూరి మల్లయ్య, అనసూర్య దంపతులు వారం రోజుల వ్యవధిలో మృతిచెందారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముక్కెర అజయ్ విషజ్వరంతోపాటు రక్తకణాలు తగ్గడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వేముల రాణి వరంగల్‌లోని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. 
 
మొక్కుబడిగా వైద్య శిబిరాలు.. 
గ్రామంలో జ్వరపీడితులు ఎక్కువవుతున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు బోడగుట్టపల్లిలో కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యం లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరంలో హెల్త్ సూపర్ వైజర్ సీతారామయ్యతో పాటు ఏఎన్‌ఎం మెటీల్డా, ఆశ వర్కర్లు మాత్రమే పాల్గొని జర్వపీడితులకు మందులు పంపి ణీ చేశారు.గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉ న్నా వైద్యులు హాజరు కాకపోవడంపై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డ్రెరుునేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.  
 
లోపం ఎక్కడ?
కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తరచూ విషజ్వరాలు విజృంభించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అధికారులు, పాలకులు అదిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు. కేవలం పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే అధికారులు మొక్కుబడిగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు సమస్యకు కారణాలు విశ్లేషించడం లేదని పేర్కొంటున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో డ్రెరుునేజీలన్నీ శుభ్రం చేరుుంచారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అయితే గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంక్ లేకపోవడంతో డెరైక్ట్ పంపింగ్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో తాగునీరు కలుషితమై విషజ్వరాలు ప్రబలుతున్నాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలకు కారణం పారిశుధ్య లోపమా లేక కలుషిత నీరే కారణమా అనే విషయం తేల్చి జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. 
 
రూ.70 వేలు కర్సయినయ్ 
నా భార్య పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గోదావరిఖని, పెద్దపల్లి ఆసుపత్రులలో చూపించినా తగ్గలేదు. ఈనెల 7వ తేదీన కరీంనగర్‌కు తీసుకెళ్లినం. పరీక్షించిన వైద్యులు డెంగీ అని చెప్పిండ్రు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచినం. వైద్యానికి రూ.70 వేలు కర్సయినయ్.
మరిన్ని వార్తలు