మోటో డబుల్‌ ధమాకా: జీ5ఎస్‌, జీ5ఎస్‌ ప్లస్‌

30 Aug, 2017 11:16 IST|Sakshiమోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ5ఎస్‌ ప్లస్‌' ను స్పెషల్‌ ఎడిషన్‌గా   లాంచ్‌ చేసింది.  తన జీ సిరీస్‌లోని కొత్త డివైస్‌లను మంగళవారం  విడుదల చేసింది.  ఎఫర్డబుల్‌ ధరలతో, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను  తమ కస్టమర్లకు అందించనున్నట్టు మోటో ఎండీ మధురుసూదిన్‌ పేర్కొన్నారు.  ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ బేసిస్‌లో ఈ క్వార్టర్‌లో 100 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. 

ఈ రాత్రి  11.59 ని.ల నుంచి అమెజాన్‌ లో ప్రత్యేకంగా లభించనుంది. దీంతోపాటు మిగతా ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోఉంటుంది.  జీ5 ఎస్‌  రూ.11,990లోనూ,   స్పెషల్‌ ఎడిషన్‌గా లాంచ్‌ చేసిన జీఎస్‌ 5 ప్లస్‌ ఫోన్‌ ధరను 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  ధర రూ. 13,999​గా,  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 15,999గా  నిర్ణయించింది.మోటో డివైస్‌ ద్వారా రూ.1000 ఎక్సేంజ్‌ ఆఫర్‌, జియో 50జీబీ 4జీ అదనపు డేటా , నో ఇఎంఐ  కాస్ట్‌ తదితర  లాంచింగ్‌ ఆఫర్లు కూడా అందిస్తోంది.

మోటో జీ5ఎస్‌  ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
4 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1500 వాట్‌ టర్బో చార్జింగ్

మోటో జీ5ఎస్‌ ప్లస్ ఫీచర్లు
5.5 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.1. 1
2.0  గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌
13 ఎంపీ   పిక్సెల్‌ రెండు రియర్‌ కెమెరాలు
ఎల్‌ఈడీ ఫ్లాష్ ,  ప్రో అండ్‌ పనోరమా  మోడ్‌ సెల్పీ కెమెరా
4 జీబీ ర్యామ్‌  64 జీబీ స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే సౌలభ్యం
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
రూ. 15,999 ధరలో ఇది బ్లష్‌ గోల్డ్‌, లూనార్‌  గ్రే లో అందుబాటులో ఉండనుంది. ఇది బ్లష్‌ గోల్డ్‌, లూనార్‌  గ్రే కలర్స్‌లో  విక్రయానికి రానుంది.
 

Read latest Technology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు