జియో ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌, మరికొద్దిసేపట్లో..ఎలా?

24 Aug, 2017 18:09 IST|Sakshi



ముంబై: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో ఫోన్‌  ప్రీ బుకింగ్‌ సమయం వచ్చేసింది. రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌   ఫోన్‌  ప్రీ బుకింగ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.  ఇవాళ (గురువారం, ఆగస్టు 24) సాయంత్రం 5గంటలనుంచి  మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుకింగ్‌ ప్రక్రియను, నగదు చెల్లింపు తదితర వివరాలను ఓ సారి  చూద్దాం.

అధికారిక  జియో వెబ్సైట్ ద్వారా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ నెట్ వర్క్ తో సహా జియో రిటైలర్లు మరియు మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో  కూడా కొనుగోలు చేయవచ్చు.  జియో యాప్‌ ద్వారా కూడా ఈ 4జీ ఫోన్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంటుంది.  పూర్తిగా ఉచితమైన ఈ 4జీ ఫోన్‌కోసం  కస్టమర్లు  గురువారం  సాయంత్రం 5గంటల నుంచి మొదలుకానున్న  ప్రీ బుకింగ్‌ సందర్బంగా  రూ.500 చెల్లించాలి.  ప్రీ బుకింగ్‌ తర్వాత మీకో టోకెన్‌ నంబర్‌ ఇస్తారు. దీన్ని డెలివరీ సమయంలో చూపించాల్సి ఉంటుంది.  ఫోన్ల డెలివరీ మాత్రం సెప్టెంబర్‌లో ఇస్తారు. అప్పుడు మిగతా రూ.1,000 చెల్లించాలి.  ఈ వాలెట్స్‌, జియో మనీ, పేటీఎం  యూపీఐ,   క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డులు, లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా పేమెంట్‌ చేయొచ్చు.

ఆన్‌లైన్‌ లో బుకింగ్‌  ఓపెన్‌ కాగానే  ప్రీ బుక్‌ నౌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. పేమెంట్‌ మోడ్‌ ఎంపిక చేసుకుని చెల్లింపు  చేయాలి.  అనంతరం "ప్రోగ్రెస్" బటన్ క్లిక్‌ చేయాలి. చెల్లింపు విజయవంతంగా జరిగితే,  స్క్రీన్ పాపప్  మేసేజ్‌ వస్తుంది.   అలాగే ఫోన్‌ బుకింక్‌ అయినట్టుగా మన మొబైల్ నంబర్‌కు కూడా ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.  ఒకవేళ మనం  వేరొకరికి ఒక ఫోన్‌ బుక్‌ చేస్తోంటే,  గ్రహీత వ్యక్తి  ఫోన్ నంబర్ని నమోదు చేయాలని గుర్తుంచుకోండి. 

అలాగే  మై  బుకింగ్స్‌ ద్వారా బుక్‌ చేసుకున్న కస్టమర్లు తమ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో బుక్‌ చేసుకోవాలంటే ఆధార్‌ తప్పని సరి. ఒక్క ఆధార్‌ నంబర్‌ మీద ఒక్క ఫోన్‌ మాత్రమే ప్రి-బుకింగ్‌ చేసుకొనే వీలుంది.  

 ఫీచర్స్‌ విషయానికి వస్తే..

- వాయిస్ కమాండ్స్‌పైపనిచేసే సామర్థ్యం
- ఆల్ఫా న్యూమరికల్‌ కీప్యాడ్
- 2.4 అంగుళాల QVGA డిస్‌ ప్లే
- ఎఫ్‌ఎం రేడియో మరియు టార్చ్‌లైట్‌
- ఎస్డీ కార్డ్ స్లాట్
- ఫోర్‌ వే నావిగేషన్ సిస్టమ్
-512 ఎంబీ  ర్యామ్‌
- 0.3 ఫ్రంట్‌ కెమెరా
- 2  ఎంపీ  రియర్‌ కెమెరా
-  ఇంటర్నల్‌  స్టోరేజ్‌ను128  విస్తరించుకునే సదుపాయం
- 2000 ఎంఏహెచ్‌బ్యాటరీ
 
వీటితో పాటు జియో మ్యూజిక్‌, జియో సినిమా, జియో టీవీ లాంటి జియో  ఇన్‌బుల్ట్‌ యాప్స్‌లభ్యం. రిలయన్స్ జియె ఫోన్ కోసం మూడు ప్లాన్లు ప్రకటించింది. వారానికి  రూ. 53, రెండు రోజులకు రూ. 23 , రూ .153 ప్లాన్లు. వీటిల్లో అపరిమిత డేటా, అపరిమిత టాక్ టైమ్, అపరిమిత  ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది.
 
ఈ మొత్తం రూ.1,500లను మూడేళ్ళ తర్వాత  పూర్తిగా రిఫండ్‌ చేయనున్నామని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ కం ఫస్ట్‌  సెర్వ్‌ ఆధారంగా ఈ  ఫోన్‌ను దక్కించుకునే అవకాశం లభించనుంది.  సో.. నో మోర్‌ వెయిటింగ్‌..బీ హర్రీ అండ్‌ స్మార్ట్‌..

జియె సైట్‌ క్రాష్‌ అయిందా?
జియో ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌ కోసం  ప్రయత్నిస్తున్నపుడు జియో.కామ్‌ అందుబాటులోలేదు. ఓవర్‌ ట్రాఫిక్‌ కారణంగా  సైట్‌ క్రాష్‌ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు జియో యాప్‌ లో   ప్రీ బుక్‌ ఆప్షన్‌ కనిపించకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు