పెద్దాయన ఔదార్యం.. 100 మందికి భోజనం

9 Apr, 2020 11:09 IST|Sakshi

మహమ్మారి కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో అనాథలు, పేదలే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కొంతమంది భోజన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న విశ్రాంత ఉద్యోగి మేకల బాలయ్య పెద్ద మనసు చాటుకున్నారు. మియాపూర్‌లోని అల్విన్‌ కాలనీకి చెందిన ఆయన తన పెన్షన్‌ డబ్బుతో దాదాపు 100 మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ క్రమంలో లేబర్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 70 ఏళ్ల వయస్సులోనూ చురుగ్గా ఉంటూ సమాజ సేవ చేస్తున్న బాలయ్యను ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు