అన్ని దానాల్లో.. అన్నదానం మిన్న 

27 Mar, 2018 08:38 IST|Sakshi
భోజనం వడ్డిస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య

భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య 

భద్రాచలంటౌన్‌:
అన్ని దానాల్లో.. అన్నదానం గొప్పదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, పులిహోర, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌సెంటర్‌ నందు సెంట్రింగ్‌ అండ్‌రాడ్‌ బెండింగ్‌ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌కో సిమెంట్‌ ఆధ్వర్యంలో స్థానిక మాధవి ఎంటర్‌ప్రైజస్‌ద్వారా భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవీ రామారావు, వెంకటరెడ్డి, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
గాయతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో.. 
భక్తులకు 5వేల లీటర్ల పానకం, వడపప్పు, 2క్టింటాళ్ల పులిహోర పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కోవూరు సంతోష్‌కుమార్, తిరుమలరావు, కృష్ణమోహన్, మూర్తి, పీ గౌతమ్, మహిళా అధ్యక్షురాలు సాగరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.  
వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో..  
భక్తులకు పులిహోర పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, బద్ది శ్రీనివాసరావు, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.  
ఇండియన్‌రెడ్‌క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో.. 
భక్తులకు 5వేల మంచినీటి ప్యాకెట్లను 5వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారుతి కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ఎల్‌ కాంతారావు, జీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో.. 
భద్రాచలం విచ్చేసిన భక్తులకు 10వేల మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో బుడగం శ్రీనివాసరావు, కుంచాల రాజారాం, సాగర్, శ్రీను, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  
మథ«ర్‌ థెరిస్సా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో.. 
స్థానిక బస్టాండులో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపకుడు కొప్పుట మురళీ, జీ నాగరాజు, అజిత్, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు