ఇంట్లోనే రంజాన్‌ తారావీహ్‌ ప్రార్థనలు

17 Apr, 2020 09:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలి

ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పవిత్ర పుణ్య మాసమైన రంజాన్‌ తారావీహ్‌ నమాజ్‌లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని ఉలేమాలు, ముఫ్తీలు, ఇస్లామిక్‌ స్కాలర్‌లు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జామియా–నిజామియా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా సహర్‌తో పాటు ఇఫ్తార్‌లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది.  
(చదవండి: ఇంకా చాలానే ఉంది..!)

ఇక రంజాన్‌ నెలలో తారావీహ్‌ను ఇంట్లోనే చేసుకోవాలని ఉలేమాన్, ముఫ్తిలు కోరడాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్వాగతించారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తిగా పేర్కొన్నారు. అన్ని ముస్లిమ్‌ పాఠశాలలకూ మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు. 

మరిన్ని వార్తలు