23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

20 Sep, 2019 03:22 IST|Sakshi
బతుకమ్మ చీరలను చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌.  చిత్రంలో శైలజా రామయ్యార్, జయేశ్‌రంజన్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి బతుకమ్మ చీర ల పంపిణీ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. 18 ఏళ్లకుపైగా వయసు కలిగి, తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీర అందిస్తామన్నారు. 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యార్‌ పాల్గొన్నారు.  

 

మరిన్ని వార్తలు