క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా డ్యూటీకి!

12 Jul, 2020 12:28 IST|Sakshi

నిబంధనలు పాటించని భిక్కనూరు వైద్య సిబ్బంది 

సాక్షి, నిజామాబాద్‌/భిక్కనూరు: కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపించకున్న హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించే వైద్య సిబ్బందే నిబంధనలను ఉల్లంఘించారు. క్యారంటైన్‌కు వెళ్లకుండా వైద్య సిబ్బంది విధులకు హాజరైయ్యారు. వివరాలు.. భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు వైద్యురాలికి సంబందించి 33మంది ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులను గుర్తించారు. వీరిలో 29 మంది వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో పనిచేసేవారు కాగా, మిగతా నలుగురు వైద్య సిబ్బంది సంబదికులుగా ఉన్నారు. వీరందరి నమూనాలను ఈనెల 12న  క రోనా పరీక్షలకు పంపిస్తారు. ఈక్రమంలో వీరంద రూ ఫలితాలు వచ్చే వరకు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
(చదవండి: నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!)

కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు. ఇలా విధులకు రావడం కొవిడ్‌ నిబందనల కు విరుద్దమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సుపత్రిలో పనిచేసే సిబ్బంది ఇతర ప్రాంతాల్లో ని వాసం ఉంటారని వారు బస్సులో విధులు నిర్వర్తించేందుకు వచ్చారని ఒకవేళ ఈ సిబ్బందిలో ఎవరికైన కరోనా పాజిటివ్‌ ఉంటే బస్సులో ప్రయాణించిన మిగత ప్రయాణికుల పరిస్థితి ఏమి కావాలని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాఖ ఉన్న తాధికారుల ఆదేశాల మేరకే తాము విధలుకు వచ్చా మని సిబ్బంది తెలిపారు. నిబంధనలు పాటించాలని,కరోనా ఫలితాలు వెలువడే వ రకు ప్రైమరీ కాంట్రాక్టు వ్యక్తులు హోంక్వారంటైన్‌లో ఉండా లని చె ప్పే వైద్య సిబ్బందే ఇలా నిబంధనలు పాటించకుండా విధులకు హాజరవ్వడం మండలంలో చర్చనీయంశమైంది.   
(కరోనాను జయించినా.. మరణం తప్పలేదు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు