కోతులకు సోకితే అంతే

21 Apr, 2020 02:50 IST|Sakshi

మనుషులు ఆహారం పెడితే వాటికి కరోనా సోకే అవకాశాలు

కోతుల నుంచి ఇతర జంతువులకు వ్యాపిస్తే దుష్పరిణామాలు 

‘సాక్షి’తో వ్యవసాయ వర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వాసుదేవరావు 

నెమ్మదిగా అడవుల్లోకి పంపించాలి: వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కోతులకి మనుషుల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశాలున్నాయని జీవ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వాటికి మనుషులు ఆహారం, పండ్లు నేరుగా అందించడం ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల నుంచి లేదా వారు పెట్టే ఆహారం నుంచి ఈ వైరస్‌ కోతులకు సోకితే సార్స్‌–సీవోవీ–2 వైరస్‌ మ్యుటేటయ్యేందుకు దోహదపడటంతో పాటు అడవు ల్లోని ఇతర జంతువులకు ఇది వ్యాపిస్తే దీర్ఘకాలం దుష్పరిణామాలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. తాజాగా తమిళనాడులోని సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఒరింతోలజీ, నేచురల్‌ హిస్టరీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ హోన్నవల్లి ఎం.కుమార తమ అధ్యయన పత్రంలో ఆయా అంశాలను ప్రస్తావించారు.

వైరస్‌లు, ఎండో పారాసైట్లు మనుషులు, జంతువుల మధ్య సోకే, వ్యాప్తి చెందే అవకాశాలున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. కోతులు, అడవి జంతువులకు మనుషులు నేరుగా ఆహారం పెట్టే అలవాటును మార్చుకోవాల్సి ఉందని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ సార్స్‌–సీవో వీ–2 వైరస్‌ మ్యుటేట్‌ అయ్యి ఇతర జం తువులకు సోకితే మొత్తం వన్యప్రాణులపైనే దాని ప్రభావం పడుతుందని తమిళనాడుకు చెందిన మరో జీవశాస్త్రవేత్త హెచ్చరిస్తున్నా రు. ఈ క్రమంలో గతంలో కోతులపై పరిశోధనతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌ సైం టిస్ట్, ఆల్‌ఇండియా నెట్‌వర్క్‌ ప్రాజెక్ట్‌ ఆన్‌ వెర్టేట్రేట్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ వి.వాసుదేవరావు ‘సాక్షి’కి పలు విషయా లు వెల్లడించారు. ‘జంతువుల కు, ముఖ్యంగా కోతులకు రెడీమేడ్‌ ఆహారం అందించాల్సిన అవసరం లేదు. పబ్లిక్‌ ఫీడిం గ్‌ వల్ల వాటికి ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకా శాలున్నాయి. వాటికి ఆహారం, పండ్లు పెట్టి ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చెం దేలా చేయడం  సమంజసం కాదు. వైరస్‌ ఎలా మ్యుటేట్‌ అవుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త అవసరం. జంతువుల నుంచి వైరస్‌లు, బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలెక్కువ. పైగా అవి స్వతహాగా ఆహారం సంపాదించుకోవాలన్న గుణాన్ని మార్చుకుని, ఆహారం పెట్టనపుడు దాడులకు దిగుతాయి. పైగా కోతుల్లో టీబీ లక్షణాలు ఎక్కువ. అవి మనుషులకు సోకే ప్రమాదం ఉంది’. 

అడవుల్లోకి తిరిగి వెళ్లేలా చేయాలి 
సమన్వయ చర్యలతో కోతులకు ఫీడింగ్‌ కంట్రోల్‌ చేయాలి. అవి తమంతట తామే అడవుల్లోకి తిరిగెళ్లేలా చూడాలి. ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నాం. మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటు ద్వారా కోతులకు పండ్లు అం దుబాటులోకి వచ్చేలా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లో వాటికి పండ్లు,ఫలాలు దొరకట్లేదు. కోతుల జనాభా నియంత్రణకు ఆపరేషన్ల ద్వారా అడ్డుకట్ట వేసేందుకు నిర్మల్‌లో సంతాన నిరోధక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.    
– వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌  

మరిన్ని వార్తలు