ఉప్పల్‌ హెరిటేజ్‌లో కరోనా‌: క్వారంటైన్‌కు 34 మంది

29 Apr, 2020 10:57 IST|Sakshi

హెరిటేజ్‌లో కరోనా కలకలంపై స్పందించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : ఉప్పల్‌ పారిశ్రామికవాడలోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కరోనా కలకలంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం ఉదయం హెరిటేజ్‌ మిల్క్‌ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న 34మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు ఉద్యోగులను బెదిరించడంపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరిటేజ్‌ మిల్క్‌ సెంటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. (హెరిటేజ్‌‌లో కరోనా కల్లోలం)

కాగా  యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, ప్లాంట్‌ను మూసివేయాలంటూ స్థానికులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్‌ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు.. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. 34మంది అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి, బెదిరింపులకు పాల్పడిన యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. (ప్రతి ఏడాది కరోనా పలకరింపులు!)

మరిన్ని వార్తలు