గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా

16 Jun, 2020 14:59 IST|Sakshi
పాత చిత్రం

సాక్షి, హైదరాబాద్: కోఠిలోని గోకుల్‌చాట్‌లో కరోనా కలకలం రేగింది. గోకుల్‌చాట్ యజమానికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు దానిని మూసేశారు. 20 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. గత రెండు,మూడు రోజులుగా గోకుల్‌ చాట్‌కు వచ్చిన వెళ్లినవారి వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో గోకుల్‌ చాట్‌‌కు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ రోజూ వందలాదిమంది చాట్‌ ఆరగిస్తారు. తాజా ఘటనతో అక్కడ ఇటీవల చాట్‌ తిన్న వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌తో మూతపడిన గోకుల్‌చాట్‌ ఈనెల 8 నుంచి తిరిగి ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 219 కరోనా కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 5,193కి చేరింది.
(చదవండి: ఆర్డ‌ర్ చేసిన ఫుడ్‌లో ఈగ)

మరిన్ని వార్తలు