సిద్దిపేటలో తొలి కరోనా కేసు

1 Apr, 2020 14:27 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : జిల్లాలో తొలి కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. గజ్వెల్‌కు చెందిన 51 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్లు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బుధవారం వెల్లడించారు. బాధితుడు ఇటీవల ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై తిరిగి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో అతనికి కరనా వైరస్‌ సోకిందని చెప్పారు. కరోనా లక్షణాలు ఉండటంతో రెండు రోజుల క్రితం అతన్ని సిద్ధిపేటలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. దీంతో సదరు వ్యక్తిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

కాగా, సిద్ధిపేటకు చెందిన ఆరుగురు నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌లో ఉంచగా ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారి నమూనాలను పరీక్షించారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మరొకరి ఫలితాలు రావాల్సి ఉంది.దీంతో నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారి సంఖ్య మరింతగ పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు సర్వే చేపట్టారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 98 మందికి కరోనా బారిన పడ్డారు. 14 మంది డిశ్చార్చి అయ్యారు. మంగళవారం ఒక్కరోనే 15 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరంత కూడా ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు, వారి బంధువులే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు