దాచుకున్న డబ్బులు దానం

9 Apr, 2020 11:15 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌కు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న మోనెకా సాగర్‌

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

కేటీఆర్‌కు చెక్కు అందించిన విద్యార్థిని

మోనెకా సాగర్‌ను అభినందించిన మంత్రి

బంజారాహిల్స్‌: మానవతా హృదయాలు స్పందిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, చిన్నారులు మొదలుకొని అన్ని వర్గాలవారూ మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. కరోనా కట్టడికి తాము సైతం చేయూతనిస్తామని భరోసానిస్తున్నాయి. ప్రభుత్వానికి తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఈ జాబితాలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థిని చేరారు. తాను కొన్నాళ్లుగా సేవింగ్‌ చేసిన రూ.లక్షను విరాళంగా అందజేశారు. బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌- 14 నందినగర్‌కు చెందిన డేంజర్‌ రాజు కూతురు మోనెకా సాగర్‌ రూ.లక్ష చెక్కును  మంత్రి కేటీఆర్‌ను కలిసి అందజేశారు. జూబ్లీహిల్స్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీనర్సింగరావు ఆధ్వర్యంలో ఆమె కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను మంత్రి అభినందించారు. మంచి మనసుతో ఇచ్చే విరాళాలు ప్రభుత్వానికి మరింత భరోసానిస్తాయని కొనియాడారు. (భారత్‌ సహకారం మరువలేనిది : ట్రంప్)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు