ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

23 Apr, 2017 02:09 IST|Sakshi
ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసినా, రాష్ట్రంలో మాత్రం ఎండల తీవ్రత తగ్గలేదు. శనివారం ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదున్నర డిగ్రీలు, నల్లగొండలో సాధారణం కంటే 4.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా 42 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 12 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌)
ప్రాంతం                ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌            42.7
భద్రాచలం              42.6
హైదరాబాద్‌           41.2
ఖమ్మం                44.0
మహబూబ్‌నగర్‌    41.9
మెదక్‌                41.6
నల్లగొండ            44.2
నిజామాబాద్‌      42.8
రామగుండం       43.2
 

whatsapp channel

మరిన్ని వార్తలు