డాక్టర్‌ సారంగపాణికి మలేసియా ఆహ్వానం

5 Sep, 2019 20:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలేసియాలో జరిగే వర్మ, ఆయుర్వేద, సిద్ధ, యోగా అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన డాక్టర్‌ ఎస్‌. సారంగపాణికి దక్కింది. ఈ మేరకు మలేసియా సొసైటీ ఆఫ్‌ ఆయుష్‌ మెడిసిన్‌ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సెలంగొర్‌లోని మహసా యూనివర్సిటీలో ఈనెల 6 నుంచి 8 వరకు జరిగే సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ఆయుర్వేదం ద్వారా అందిస్తున్న వివిధ చికిత్సా పద్ధతులు, వాటి ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనల పురోభివృద్ధి గురించి ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగాలు ఉంటాయి.

ఆయుర్వేదంలో సుశృతునిచే చెప్పబడిన క్షారసూత్ర, క్షార కర్మ, రక్తమోక్షణ, జలగ చికిత్సలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా ఎలా నిరూపించబడ్డాయో ప్రపంచ దేశాలకు వైద్యులకు తెలియజేసే అవకాశం ఈ సదస్సు ద్వారా కలుగుతుందని డాక్టర్‌ సారంగపాణి అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభం ఉన్న ఆయన డాక్టర్‌ బీర్ఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ విభాగం సీసీఐఎం ఎడ్యుకేషన్‌ కమిటీకి గతంలో మార్గదర్శకుడిగా, వైస్‌ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు.

మరిన్ని వార్తలు