కరోనాతో తెలంగాణ జర్నలిస్ట్‌ మృతి

7 Jun, 2020 13:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో కరోనా వైరస్‌ బారిన పడి ఓ జర్నలిస్ట్‌ ప్రాణాలు విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న‌ జర్నలిస్ట్‌ మనోజ్‌.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషయమించటంతో ఆదివారం కన్నుమూశారు. మాదన్న పేటకు చెందిన మనోజ్‌ పలు టీవీ ఛానళ్లలో క్రైమ్‌ రిపోర్టుగా పనిచేశారు. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో క్రైం రిపోర్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ( క‌రోనా పేషెంట్ శ‌వాన్ని విసిరేసి..)

కాగా, తెలంగాణలో శనివారం ఒక్కరోజే 206 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10మంది మృత్యువాత పడ్డారు.  రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌ జిల్లాలో 18, నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో ఐదు చొప్పున నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4, జగిత్యాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో 2 చొప్పున, వికారాబాద్, జనగామ, గద్వాల, నల్లగొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా ల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. శనివారం నాటితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,496 కు పెరిగింది. ఇప్పటివరకు 1,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,663 మంది చికిత్స పొందుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు