లాక్‌డౌన్‌ మరికొంతకాలం పొడిగించాలి

11 Apr, 2020 02:42 IST|Sakshi

కరోనా తర్వాత వైద్య సదుపాయాల మీద దృష్టి

పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో నిర్ణయం

ఏడాదికి పది రోజులు లాక్‌డౌన్‌ ఉంటే బాగుంటుంది

‘ఆస్క్‌ కేటీఆర్‌’ పేరిట ట్విట్టర్‌లో కేటీఆర్‌ సంభాషణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’పేరిట నిర్వహించిన సం భాషణలో శుక్రవారం పలువురు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చారు. లాక్‌డౌన్‌ మూలంగా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన వారిపై ప్రజ ల్లో గౌరవ భావం ఏర్పడిందన్నారు. గుర్తించిన హాట్‌స్పాట్లలో సామూహిక వైద్య పరీక్షలు చేయడం ద్వారా ఫలితం ఉంటుందని, వైరస్‌ కట్టడికి కృషి చేస్తున్న వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్‌ దొరికేం త వరకు విదేశాలకు రాకపోకలపై సంపూర్ణ నిషేధం ఆచరణ సాధ్యం కాదన్నారు.  

అత్యుత్తమ సదుపాయాలపై దృష్టి 
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడిన తర్వాత మరింత అత్యుత్తమ వైద్య మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించాల్సి ఉంటుందని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుత సంక్షోభం తర్వాత ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతను మార్చుకొని వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలకి ఒక కనువిప్పు లాంటిదని, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయాన్ని గుర్తించాయన్నారు. సంక్షోభ సమయంలో పరీక్షల గురించి తల్లిదండ్రులు ఓపిక పట్టాలని, పరీక్షల షెడ్యూలుకు సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. 

ఏడాదికి పది రోజుల లాక్‌డౌన్‌ 
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏటా పది రోజులు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని కేటీఆర్‌ వ్యా ఖ్యానించారు. ప్రస్తుత తరుణంలో రాజకీయాలకు అవకాశం లేదని, అధికారం ఉన్నందువల్లే తాను ఎక్కువ మందికి సాయపడుతున్న ట్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తో చర్చిస్తున్నామన్నారు. ప్రజలతో కనెక్ట్‌ అ య్యేందుకు సోషల్‌మీడియాలో ఎక్కువ సేపు అందుబాటులో ఉండటంతో నిద్రకు సమ యం దొరకడం లేదన్నారు. లాక్‌డౌన్‌ మొదలైన రోజు నుంచి కేటీఆర్, ఆయన కా ర్యాలయం స్పందిస్తున్న తీరును ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అభినందించారు.

మరిన్ని వార్తలు