హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాకం

19 Jul, 2020 12:31 IST|Sakshi

జ్వరం వస్తే ట్యాబ్లెట్‌ వేసుకుని డ్యూటీ రావాల్సిందే

తమిళనాడు నర్సులను నిర్బంధించి ప్రైవేట్‌ ఆస్పత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఓ వైపు కరోనా వైరస్‌ విశ్వరూపం చూపిస్తుంటే.. మరోవైపు పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు దారుణానికి పాల్పడుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ డ్యూటీకి రావాలంటూ నర్సులను వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మోహదీపట్నంలోని నానాల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆస్పత్రి యాజమాన్యం తమిళనాడుకు చెందిన నర్సులను నిర్భంధించింది. జ్వరం వచ్చినప్పటికీ ట్యాబ్లెట్‌ వేసుకుని డ్యూటీకి రావాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో దిక్కుతోచని నర్సులు ఈ విషయాన్ని తెలంగాణ నర్సింగ్‌ సమితికి దృష్టికి తీసుకు వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు