అయ్యో ! కరోనా ఎంత పని చేసింది

29 Apr, 2020 07:01 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:విధి ఎంత విచిత్రమైందో.. ఎంతటి బలీయమైందో ఈ చిత్రం చూస్తే అవగతమవుతుంది. ఎంతటివారికైనా బతుకు బాటలో కష్టాలు, కన్నీళ్లూ తప్పవని రుజువుగా నిలుస్తోంది. కరుణ లేని కరోనా వికృత రూపం జనజీవితాలను దయనీయ స్థితికి ఎలా దిగజార్చిందో ఈ దృశ్యమే తార్కాణం. మంగళవారం కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండ వద్ద గౌరవప్రదంగా జీవనం సాగించే ఓ పురోహితుడు వాహనదారులను ఇలా యాచించడంతో అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు