ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఎన్నికల వివాదం

13 Apr, 2015 01:15 IST|Sakshi
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఎన్నికల వివాదం
  • ఎన్నికలు వస్తే వేతన సవరణ ప్రక్రియకు బ్రేక్
  • నివారణ చర్యల్లో గుర్తింపు సంఘం కూటమి
  • సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మిక సంఘాల మధ్య చిచ్చు రగిలింది. వేతన సవరణ కోసం ఓవైపు సమ్మెకు కార్మికులు సై అంటున్న తరుణంలో గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడిది కార్మికుల్లో కొత్త వివాదాన్ని రగిలించింది. ఎన్నికల నగారా మోగితే కోడ్ అమలులోకి వస్తుంది. దాంతో వేతన సవరణ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూని యన్(టీఎంయూ)ల కూటమి గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తోంది. రెండేళ్ల కాలం ముగియటంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

    ఈ నేపథ్యంలో నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) నేతలు కొందరు ఇటీవల ఆ కూటమి గుర్తింపు హోదాను సవాల్ చేస్తూ కార్మికశాఖకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమా అని కార్మిక శాఖ ప్రశ్నించగా అందుకు సిద్ధమని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. దీంతో కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కార్మిక సంఘాల సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఎన్నికల కోడ్ మొదలవుతుంది.

    ఎన్నికల కోడ్ ముగిసేవరకు వేతన సవరణ ప్రక్రియ నిలిచిపోనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలంటూ ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాల కూటమి యాజమాన్యాన్ని కోరింది.  దానివల్ల వార్షికంగా ఆర్టీసీపై పడే రూ.1,800 కోట్ల భారాన్ని  సంస్థ భరించలేదని యాజమాన్య తేల్చటం.. దీంతో ఈనెల 15లోపు నిర్ణయం రానిపక్షంలో 16 నుంచి సమ్మె చేస్తామం టూ నోటీసు జారీచేయటం వెంటవెంటనే జరిగిపోయా యి. ఇలాంటి తరుణంలో ఎన్నికల కోడ్ వచ్చి వేతన సవరణ ప్రక్రియ ఆగిపోతుందనే అంశం కలకలం రేపుతోం ది. దీంతో కార్మికశాఖ యూనియన్లతో సమావేశం ఏ ర్పాటు చేయకుండా గుర్తింపు సంఘాలు యత్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు