సృజనాత్మకత పెంచుకోవాలి

11 Feb, 2019 04:22 IST|Sakshi

మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సృజనాత్మకను, నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుం దని, అలాగే విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. గ్రామాలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని అప్పుడే అనుకున్న ప్రగతి సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌)లో ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ డిస్కోర్స్‌’’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ చదువంటే కేవలం పరీక్షల కోసమేనన్న భావన నుంచి బయటకు రావాలని సూచించారు.

నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. టాటా కన్సల్టెంట్‌ సర్వీస్‌(టీసీఎస్‌) నిర్వహించిన సర్వేలో గణిత సమస్యల సాధనలో ఇండియాలోని 21 ఏళ్ల ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఓఈసీడీ దేశాల 15 ఏళ్ల విద్యార్థుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం బాధాకరమన్నారు. మన దేశ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా కృషి జరగాలన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని లేకుంటే అది సమాజా నికి పెను సవాలుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తు న్నా గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి ఫలా లు అందుకోలేకపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డా.రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు