కలెక్టరేట్ ఎదుట ధర్నా

5 Nov, 2015 12:22 IST|Sakshi

కరీంనగర్: ‘లక్ష కొలువులు’ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మైనార్టీ ఉద్యోగార్థులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం అభ్యర్థులు గురువారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి వెంటనే ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు