ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల ఇక్కట్లు

20 Aug, 2014 02:09 IST|Sakshi
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల ఇక్కట్లు

ఫాస్ట్... పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం సంగతేమో గానీ, విద్యార్థులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారోనని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్ప ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు.
 
నీలగిరి
ఫాస్ట్(తెలంగాణ విద్యార్థులకు ఆర్థికసాయ పథకం) కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు కూడా విడుదల కాలేదు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సా ధ్యంకాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఈ పథకం అమలు ఎప్పుడు అవుతుందో ఏమోకానీ గతేడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నేటికీ విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోం ది. ఫీజు బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిచేస్తున్నాయి. కోర్సు పూర్తిచేసినవారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. 2013-14కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు కలిపి జిల్లాలో మొత్తం రూ.107.50 కోట్లు బకాయిలు ఉన్నాయి.
 
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఫాస్ట్ పథకం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. స్థానికత అంశం తేలే వరకు ఫీజులు విడుదల చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫాస్ట్ పథకం మార్గదర్శకాలు రూపొందిం చాల్సి ఉంది.

1956 స్థానికతను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం గతేడాది ఫీజులు విడుదల చేయాలని భావిస్తే మాత్రం చాలా మంది విద్యార్థులు నష్టపోవాల్సి ఉంటుంది. ఇది లావుంటే ఈ ఏడాది కొత్తగా ప్రవేశాలకు సంబంధించి ఫీజులు, ఉపకార వేతనాల కోసం ద రఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆన్‌లైన్ ప్రక్రియ మొదలుకాలేదు. ఫాస్ట్ మార్గదర్శకాలు ఖరారు అయితే తప్ప ఆన్‌లైన్ నమోదు చేసుకోవడం కుదరదని అధికారులు చెబుతున్నారు.
 
విద్యార్థుల ఆందోళన...
గతేడాది ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెన్యువల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కోర్సు పూర్తి చేసిన వారు తదనంతర చదువుల కోసం మరొక ప్రాం తానికి వెళ్లాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించకపోడంతో కళాశాలల యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు మొండి కేస్తున్నాయి.
 
 బకాయిలు ఇవీ..
 జిల్లాలో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మా ఇతర  కాలేజీలు కలిపి మొత్తం 570 ఉన్నాయి. 2013-14 సంవత్సరానికి సంబంధించి ఎస్టీ విద్యార్థులకు రూ.31 కోట్లకు గాను రూ.22 కోట్లు విడుదల అయ్యాయి. ఇంకా రూ.11 కోట్లు రావాల్సి ఉంది. దీంట్లో రూ.10 కోట్లు ఫీజులు కాగా, మెస్ చార్జీలు కోటి రూపాయలు.  బీసీ విద్యార్థులకు రూ.83 కోట్లు , ఎస్సీ విద్యార్థులకు రూ. 14.50 కోట్లు రావాల్సి ఉంది. ఇవిగాక మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల బకాయిలు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు