గిరిజనేతర హక్కులు ఆధిపత్యంలో భాగమే!

31 Dec, 2015 01:27 IST|Sakshi
గిరిజనేతర హక్కులు ఆధిపత్యంలో భాగమే!

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అక్టోబర్ 13న దాదాపు 10 వేలమంది గిరిజనులతో బహిరంగ సభ జరిగింది. 1/70 చట్టాన్ని సవరించాలని, గిరిజనుల తోపాటు గిరిజనేతరులకు కూడా అన్ని విషయాల్లో సమాన హక్కులు కల్పించాలన్నవి వీరి ప్రధాన డిమాండ్లు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేత రుల ఆధిపత్య భావజాలానికి పరాకాష్టగా జరుగు తున్న ఆందోళన ఈ రోజుది కాదు. ఏజెన్సీ ప్రాంతా ల్లో గిరిజన హక్కులను ఎత్తిపడుతూనే గిరిజనేత రుల సమస్యను ప్రతీఘాతుక ఉద్యమంగా మార్చా లని చూస్తున్న ఆధిపత్య శక్తులను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

పాలకవర్గాలు ప్రజలపై సాగిస్తున్న బహుముఖ దోపిడీ వల్ల గిరిజన తెగలతోపాటు గిరిజనేతర సమాజం కూడా ప్రభావితమవుతున్నది. ఆదివాసీ ప్రాంతాల్లో పెరిగిపోతున్న గిరిజనేతరుల చొరబా టును ఓట్లరూపంలోనూ, తమ దోపిడీకి పునాది గానూ వాడుకోవచ్చనే భావనతో ఆదివాసేతర భూ స్వాములు, పెత్తందార్లు, రాజకీయ నేతలు అన్యా యమైన  వాదనలు లేవదీస్తున్నారు. కనీస హక్కుల కోసం గిరిజనేతరులు చేస్తున్న డిమాండ్లు పైకి చాలా న్యాయంగానే కనిపిస్తున్నప్పటికీ వారెంచుకునే పోరాట రూపాలు సామాజిక న్యాయాన్ని, సహజ న్యాయాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి.

 గిరిజనేతర ఓట్ల కోసం గిరిజన నేతలుగా చలా మణి అవుతున్న గిరిజన దళారీలు కూడా ఈ ప్రతీ ఘాతుక ఉద్యమంలో ఏదో ఒక పాత్ర పోషించడం గమనార్హం. కానీ రాజకీయ పార్టీల వైఖరి, సర్వేజనా స్సుఖినోభవంతు అనే అవగాహన వల్ల వీరంతా గిరిజన హక్కుల విషయంలో సహజన్యాయాన్ని మర్చిపోతున్నారు. గిరిజన చట్టాలను, రాజ్యాంగ రక్షణలను రద్దు చేస్తే ఇక ఆదివాసీ అనే మనిషి కానరాని పరిస్థితి రాక తప్పదు.  ఆ కాస్త రక్షణలు లేకుంటే ఆదివాసులకు గూడు కూడా ఉండదు.

 షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసిస్తున్న దళిత కులాలకు చెందిన నిరుద్యోగులు తమ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనతో ఉండటం వాస్తవం. 60, 70 ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నా తమకు భూముల్లేవని, ఉన్నా పట్టాలు ఉండవనీ, గిరిజనుల కన్నా అధ్వాన స్థితిలో ఉన్న తాము కులవివక్ష కూ గురవుతున్నామని వీరంటున్నారు. పైగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్ భూమిపై తమకు హక్కులు వర్తించవని ఏజెన్సీలో దళిత, బీసీ కులాల్లోని విద్యా వంతులు నిరసన తెలుపుతున్నారు. సరిగ్గా ఈ స్థితి నే ఆధిపత్య శక్తులు ఉపయోగించుకుంటున్నాయి.

షెడ్యూల్డ్ ప్రాంతాలను ఎత్తివేయాలనే ఉద్యమాలు సహజ న్యాయాన్ని, ధర్మాన్ని చూడటం లేదు. పైగా గిరిజనులపై భారత పాలకులు ఏనాడూ ప్రేమను కురిపించలేదు. 1960-2011 మధ్యలో దేశంలో రెండున్నర కోట్లమంది ప్రజలు నిర్వాసి తులు కాగా, వారిలో 40 శాతం మంది గిరిజను లేనని కేంద్ర నివేదిక తెలిపింది. గిరిజనుల ప్రతిఘ టన వల్ల తీసుకొచ్చిన నామమాత్రపు రక్షణ చట్టాలు కూడా తమకు ఆటంకం అని భావిస్తున్న దళారీ పాలక వర్గాలు గిరిజన ప్రాంతాల సంపదను దోచు కోవడానికి తీవ్రమైన అణిచివేతను ప్రయోగిస్తు న్నాయి.

ఈ నేపథ్యంలో కోనేరు రంగారావు కమిటీ ఆదివాసీల రక్షణ కోసం గతంలో చేసిన 41 సూచ నలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ తెలం గాణ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆదివాసీ ప్రాంతా ల్లో ప్రజలను నిర్వాసితులను చేసే వారి అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులను వ్యతిరేకించాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులు గౌరవంగా ఆదివాసీ ప్రజలతో కలిసి జీవించాలి. మైదాన ప్రాం తాల నుంచి బతుకు తెరువు కోసం వెళ్లిన వారికి ఈ దేశ మూలవాసులు ఎన్నడూ హాని తలపెట్టలేదని గుర్తించాలి. శతాబ్దాల పోరాటం ఫలితంగా గిరిజ నులకు సంక్రమించిన కనీస రక్షణ చట్టాలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత గిరిజన, గిరిజనేత రులందరిపై ఉంది.  అటవీప్రాంతాల్లోకి వెళ్లి మాకు హక్కులెందుకివ్వరని అడగటం కన్నా, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు తాము ఉన్నచోటనే భూమిపై హక్కు కోసం, మెరుగైన జీవితం కోసం పోరాడితే పీడిత వర్గాల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. వారి మధ్య సమస్యలూ పరిష్కారమవుతాయి.
 (వ్యాసకర్త: నలమాస క్రిష్ణ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 తెలంగాణ ప్రజా ఫ్రంట్  98499 96300)

మరిన్ని వార్తలు