ఆధునికతకు దూరంగా...!

8 Nov, 2016 01:57 IST|Sakshi
ఆధునికతకు దూరంగా...!

విశ్లేషణ
స్వచ్ఛ భారత్ సరే... నీళ్లు లేని టాయ్‌లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలితమే మరుగుదొడ్లు. తేఢా ఏమిటంటే వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు.
 
ఎవరైనా ప్రకృతి పిలుపు అవసరం పడినప్పుడు తప్పకుండా దాన్ని తీర్చు కోవలసి ఉంటుంది. అందుకనే బర్హాన్ పూర్‌లోని కుగ్రామం పటిల్పడాలో చిత్రి స్తున్న చిత్రకారుడి కేసి చూస్తున్న పదేళ్ల అబ్బాయిని ఈ విషయమై నేను అడిగి నప్పుడు అతడు బొటన వేలును చూపి ‘అక్కడ మరుగుదొడ్డి ఉంది’ అని చెప్పాడు. ‘ఎవరింట్లో అయినా ఉందా?’అని అడిగితే.. ‘అవును, అక్కడ నీరు లేదు’ అన్నాడతను. మరుగుదొడ్డి అంటే ఏమిటి అనే విషయంలో నగర జీవిత దృక్పథాన్ని అతడు అర్థం చేసుకోవడం అద్భుతమైన విషయం. టాయ్‌లెట్ అంటే పరిశుభ్రంగానూ, ఉపయోగించుకోదగినది గాను ఉండటం అనే కదా అర్థం. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో బర్హాన్‌పూర్ ఉంటోంది. ప్రస్తుతం పాల్ఘర్ తాలూకాలో ఉన్న ఈ గ్రామాన్ని ఇటీవలే థానే జిల్లా నుంచి వేరు చేశారు. దీంతో థానే దాదాపుగా పట్టణ ప్రాంత జిల్లాగా మారిపోయింది. పాల్ఘర్ దాదాపుగా గ్రామీణ, గిరిజన ప్రాంతం. ఇది చిన్నది, ఒక జిల్లాలో భాగం కాదు కాబట్టి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తు న్నారు. మెరుగైన కేంద్రీకరణ, సత్వర పాలనాయంత్రాంగం కోసమే దీన్ని వేరు చేశారు.
 
అయితే నీళ్లు లేని టాయ్‌లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలి తమే మరుగుదొడ్లు. వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు. కానీ టాయ్‌లెట్‌లను నిర్మించడం ద్వారా, భారత్‌ను స్వచ్ఛంగా ఉంచడానికి జరుగుతున్న ప్రచా రానికి అనుకూలంగా గణాంకాలు రూపొందుతాయి. ఇది ఒక భ్రమాత్మక వంచనతో కూడిన కార్యక్రమం. ఇలాంటి నీళ్లులేని మరుగుదొడ్లు గ్రామాల్లోనే కాదు.. ముంబైలోని మురికివాడల్లో కూడా ఇవి ఉంటున్నాయి. దాదాపు 20 మంది కళాకారులు తమ కుంచెలతో, బొమ్మలు గీయడానికి పెట్టుకునే ఏటవాలు బల్లలతోపాటు, అనువైన ప్రదే శాలను గుర్తించి వాటిని ప్రత్యక్షంగా చిత్రించడానికి గాను పటి ల్పడాకు వచ్చినప్పుడు ఆ కుగ్రామానికి విషమ పరీక్షే మరి. అది కూడా ఈ కళాకారులు నేరుగా రంగంలో ఉండి చిత్రించడానికి వచ్చారు. నీటిరంగు పెయింటింగులో అద్భుతప్రావీణ్యం ఉన్న ముంబై కళాకారుడు అమోల్ పవార్ నిర్వహించిన ఒక వర్క్ షాపులో వీరు భాగం. తన నైపుణ్యాలను ఇతరులకు పంచిపెట్టి వారిని మెరుగుపర్చాలని ఆయన కోరిక.
 
ఉన్నట్లుండి ఒక బస్సు నిండా కళాకారులు తమ ఊరికి వచ్చి దిగడం బర్హాన్‌పూర్ నివాసులకు ఆశ్చర్యకరమైంది. రెండు రోజుల పాటు, రోజుకు 5 నుంచి 6 గంటలదాకా వీరు గ్రామస్తుల భూముల్లో, ఆవరణల్లో గుమికూడి సందడి చేశారు. కానీ గ్రామ స్తులు ఆ కళాకారులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. రెఫరెన్స్ ఫొటో లను తీసుకోవడానికి వారిని తమ ఇళ్లలోకి అనుమతించారు. తమ ఇంటిమెట్లపై కూర్చోనిచ్చారు. ప్రారంభ ఆసక్తి తగ్గిపోయాక, ఈ కొత్త అతిథులతో ఇబ్బంది పడకుండా గ్రామస్తులు తమ రోజు వారీ పనులకు వెళ్లేవారు. కళాకారులు తమ కుగ్రామాన్ని ఎంచు కుని మరీ వచ్చారన్న వాస్తవాన్ని వారు బోధపర్చుకున్నట్లు కనిపిం చింది. ఈ గ్రామంలో 4 వేలమంది నివసిస్తున్నారు.
 మన కాలనీలలోకి అలా ఎవరయినా వచ్చి ఆక్రమిస్తే అను మతించేవాళ్లమా అని మాకు మేమే ప్రశ్నించుకున్నాం. అలా ఎవ రైనా ఊడిపడితే వంద ప్రశ్నలడిగేవాళ్లం. మన గోప్యతపై వారి దాడి గురించి ఆందోళన చెంది ఉండేవాళ్లం. చివరకు పోలీసులను కూడా పిలిచేవాళ్లం. గుర్తుంచుకోండి. మనం స్పాట్‌లో రైల్వేస్టేష న్లను చిత్రించలేము. ఎవరైనా సరే రిఫరెన్స్ చిత్రాన్ని ఎవరూ చూడకుండా ఫొటోతీయగలరు, దీని ఆధారంగా తదుపరి పని జరుగుతుంది. కాని ఇక్కడేమిటి.. మేం పెయింటింగులు వేసు కోవడానికి వారు ఊరినే మాకు అప్పగించి వెళ్లారు.
 
ఆశ్చర్యపర్చే రెండో విషయం ఏమిటంటే, గ్రామం ఎంత పొందికగా ఉండేదంటే నీటిరంగులో ముంచిన కుంచెను తుడవ డానికి ఉపయోగించే టిస్యూ పేపర్‌ని నేలమీద విసిరివేస్తే అది బాధించే పుండులాగా ఉండేది. నిస్సందేహంగా గ్రామం బుర దతో ఉండేది. కానీ ప్రతి ఇంటి ముందు నేలమీద ఉండే ధూళిని ఆవుపేడ కలిపిన నీళ్లతో అలికి మటుమాయం చేసేవారు. ఆ గ్రామంలో ప్లాస్టిక్ సంచులు కానీ, గుట్కా ప్యాకెట్లు కానీ లేవు. గ్రామం పేదదే అయినప్పటికీ పరిశుభ్రంగా ఉండటం మాలో కొందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి చెత్తా లేదు. ప్రతిరోజూ ఆవు పేడను ఎండిపోకముందే గ్రామస్తులు సేకరించుకునేవారు. అన్నిటికీ మించి చిన్నదే అయినప్పటికీ గ్రామ ప్రధాన రహదారి మన నగర రహదారులతో పోలిస్తే సాఫీగా ఉండేది. బర్హాన్ పూర్ మా హృదయాలను కొల్లగొట్టిందని మాత్రం చెప్పగలను.
 
ప్రత్యేకించి డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకొస్తున్న మోదీ అధికారులకు మాత్రం ఒక విషయం మనం చెప్పితీరాలి. ముంబై-అహ్మదాబాద్ హైవేకి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ల నుంచి బలహీనమైన సిగ్నల్స్ వెలువడుతుం టాయి. 3జి కవరేజీ కలిగిన స్మార్ట్ ఫోన్‌లో కూడా ఇంటర్నెట్ పనిచేయదు. నిజానికి హైవేకి  దగ్గర ఉండి కూడా మీరు ఇంటికి కాల్ చేయలేరు. గ్రామానికి అవతల ప్రపంచం గురించి ఎవరూ పట్టించుకోరు. మేం బస చేసిన స్థలంలో కనీసం టీవీ కూడా లేని విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. లోకజ్ఞానం విషయంలో నాకు అమితాసక్తి కాబట్టి నేను టీవీని మిస్ కావచ్చు కానీ ఇతరులు అలా భావించినట్లు లేదు. వర్తమాన ఘటనలకు చెందిన వార్తలు వారిలో ఆసక్తి కలిగిస్తు న్నట్లు కనిపించలేదు. మీరు వేటికయినా దూరమయ్యారా అని నా తోటి కళాకారులను కొందరిని ప్రశ్నించాను. అలాంటి ప్రశ్న వేయ వచ్చా అన్నట్లుగా వారు అపనమ్మకం వ్యక్తపరిచారు. బహుశా రాత్రిపూట షోలలో వాగుడుకాయలు చిందించే చెత్తకంటే ఎక్కువ మంది ప్రజలపైనే టీవీ స్టూడియోలు దృష్టి సారిస్తూండవచ్చు.
 


మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు