'నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను' గెలిపిస్తే.. ఖానాపూర్‌ దత్తత తీసుకుంటా : కేటీఆర్‌

18 Nov, 2023 08:27 IST|Sakshi
జాన్సన్‌నాయక్‌తో కలిసి అభివాదం చేస్తున్న కేటీఆర్‌

తమ్ముడు జాన్సన్‌ను గెలిపించండి!

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌..

టైగర్‌ జోన్‌ నిబంధనల సడలింపునకు హామీ..

సాక్షి, ఆదిలాబాద్‌: ‘నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా’నని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్‌ నియోజకవర్గం జన్నారం మండల కేంద్రంలోని మనోహర్‌రావు మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.

అంతకుముందు హెలిప్యాడ్‌ వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భుక్య జాన్సన్‌నాయక్‌, జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌రాథోడ్‌, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఏపీపీఎస్సీ సభ్యుడు రవీందర్‌రావు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఖానాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్‌ బలపర్చిన జాన్సన్‌నాయక్‌ను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చాక జాన్సన్‌నాయక్‌ సూచించిన విధంగా జన్నారం ప్రభుత్వ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రి స్థాయికి పెంచుతామని, డివైడర్లతో సెంట్రల్‌ లైటింగ్‌సిస్టం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. టైగర్‌జోన్‌ నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రత్యర్థులపై విసుర్లు..
ఓ వైపు హామీలు ఇస్తూనే కేటీఆర్‌ ప్రత్యర్థులపై వి సుర్లు కురిపించారు. రాష్ట్రంలో ఎవ్వరేమి చేసుకు న్నా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్‌ ఏమో చేస్తానని హా మీలు ఇస్తున్నా వారితో ఏమీ జరగదని విమర్శించారు.

‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా’ అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మతతత్వ పార్టీలను దగ్గర కు రానీయొద్దని, కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుంటే ప్రతీ విషయానికి ఢిల్లీకి వెళాల్సి ఉంటుందని అన్నా రు. టికెట్ల కేటాయింపులో, బీఫాం ఇవ్వడంలో ఢిల్లీ కి వెళ్లినట్లు రేపు హామీలు అమలు చేయాలంటే కూ డా ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు వింటారని అన్నారు.

సమస్యలు చూడన్న: భుక్యా జాన్సన్‌ నాయక్‌
ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భుక్య జాన్సన్‌ నాయ క్‌ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సదర్‌మాట్‌ అభివృద్ధి, కడెం ప్రాజెక్టు పటిష్టత, టైగర్‌జోన్‌ నిబంధనల సడలింపు, ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంపుపై విన్నవించారు. జన్నారం మండలానికి డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలకు పక్కా భవనం ఏర్పాటు చేయాలని కోరారు.

పోటెత్తిన జనం!
సభకు బీఆర్‌ఎస్‌ నాయకుల అంచనా కంటే అధికంగా పోటెత్తారు. నియోజకవర్గంలో 40వేల మంది హాజరవుతారని అంచనా వేయగా 60వేలకు పైగా వచ్చారు. సభలో స్థలం లేకపోవడంతో కొందరు బయట నిల్చోవడం కనిపించింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది.

పార్టీలో చేరికలు..
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌టీపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఉట్నూర్‌ జెడ్పీటీసీ చారులత రాథోడ్‌, వైఎస్సార్‌టీపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు సిరికొండ లక్ష్మీ, బీజేవైఎం మంచిర్యాల జిల్లా నాయకుడు కొండపల్లి మహేశ్‌, మాజీ జెడ్పీటీసీ గణేశ్‌ రాథోడ్‌, ఎస్సీసెల్‌ కన్వీనర్‌ వీరేందర్‌, తోటి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌, ఎంపీటీసీ శ్రీదేవి, సిరికొండ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గంగాధర్‌, కవ్వాల్‌ ఎంపీటీసీ సౌజన్య, మహ్మద్‌ సాబీర్‌, ఆయా పార్టీ నాయకులు పార్టీలో చేరగా కేటీఆర్‌ కండువా కప్పి ఆహ్వానించారు.

ఎంపీ వెంకటేశ్‌ నేత, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, ఎంపీపీ సరోజన, జెడ్పీటీసీలు చంద్రశేఖర్‌, జానుబాయి, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, పొనకల్‌ సర్పంచ్‌ జక్కు భూమేశ్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాసగౌడ్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రియాజొద్దీన్‌, కోఆప్షన్‌ సభ్యుడు మున్వర్‌ అలీఖాన్‌, పొనకల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌ వివిధ మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..

మరిన్ని వార్తలు