రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు: ఎ.కె.సింఘాల్‌

9 May, 2021 18:35 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రెమ్‌డెసివర్‌పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, హెల్ప్‌లైన్‌ ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్రంలో 637 హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్స అందిస్తున్నాం.13,461  ప్రవేట్ హాస్పిటల్స్‌లో రేమ్‌డేసివర్ అందుబాటులో ఉన్నాయి. 104 కాల్ సెంటర్‌కు 16, 905 కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 లక్షలు 8 వేల మంది కాల్స్ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకున్నాం.

కోవిన్ యాప్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాం.. అంగీకరించింది. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లో ప్రాధాన్యత కల్పిస్తూ జీవో జారీ చేశాం. 15% వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించాం. చాలా చోట్ల మొదటి వ్యాక్సినేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనం ఎక్కువగా ఒకే చోట గుమికూడకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామ’’న్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు