ఏపీలో ఉద్యోగుల పనివేళల్లో మార్పు!

7 May, 2021 16:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో  కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున  ఉత్తర్వులను జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్‌, జిల్లా కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులో రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. కాగా అత్యవసర సర్వీసులకు ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు