మహిళా సాధికారతలో రాష్ట్రం అగ్రగామి

24 Apr, 2021 03:52 IST|Sakshi

2021–22లో అక్కచెల్లెమ్మలకు వివిధ పథకాలతో రూ.18,901 కోట్లు 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మహిళ వ్యాపార దక్షతతో ఎదిగేందుకు ఓ అన్నగా, తమ్ముడిగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను జమ చేసిన సందర్భంగా లబ్ధిదారులైన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు శుక్రవారం ఆయన స్వయంగా లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సున్నావడ్డీ కింద ఇప్పుడిస్తున్న రూ.1,109 కోట్లతోపాటు జూన్‌లో ‘వైఎస్సార్‌ చేయూత’ కింద సుమారు రూ.4,500 కోట్లు, సెప్టెంబర్‌లో ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా రూ.6,792 కోట్లు, జనవరిలో ‘అమ్మఒడి’ ద్వారా రూ.6,500 కోట్లు ఇస్తామన్నారు. ఇలా వివిధ పథకాల కింద 2021–22లో అక్కచెల్లెమ్మలకు సుమారుగా రూ.18,901 కోట్లు అందచేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు