కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

18 Jun, 2021 11:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కోవిడ్‌ నివారణ చర్యలపై  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. 350 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ విషయంలో రాష్ట్రానికి స్వయం సమృద్ధి వస్తుందన్నారు. ఈ సమీక్షకు మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌ వేగవంతంపై అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. కేసుల తగ్గుదల, కర్ఫ్యూ కొనసాగింపు, సడలింపులపై సమావేశంలో చర్చించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు