ఏపీలో కొత్తగా  551 కరోనా కేసులు

8 Dec, 2020 16:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,187నమూనాలు పరీక్షించగా  551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,72,839  కు చేరింది. కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,042 కి చేరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 744  మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,429 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు