కోవిడ్‌ కట్టడికి ప్రజా ప్రతినిధులతో సమీక్ష కమిటీలు

8 May, 2021 03:26 IST|Sakshi

సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి నివారణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన మంత్రుల బృందం సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

ఈ కమిటీలు జిల్లా స్థాయిలో కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన నిర్ణయాలను సకాలంలో తీసుకోవడంతో పాటు అధికారులకుతగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేయనున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన గల కమిటీల్లో సభ్యులుగా జడ్పీ చైర్‌పర్సన్, జిల్లాకు చెందిన మంత్రులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లు ఉంటారు. సభ్య కన్వీనర్‌గా జిల్లా కలెక్టర్‌ ఉంటారు.  

మరిన్ని వార్తలు