స్ట్రాబెర్రీ సాగుతో ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి

26 Jan, 2021 05:11 IST|Sakshi

 సీఎం వైఎస్‌ జగన్‌కు స్ట్రాబెర్రీలు అందజేసిన ఎంపీ మాధవి

సాక్షి,అమరావతి: స్ట్రాబెర్రీ సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉన్నందున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంకు ఆమె స్ట్రాబెర్రీ పండ్లను బహూకరించారు. చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో గిరిజనులు ఎక్కువగా స్ట్రాబెర్రీ సాగుచేస్తున్నారని, దీనిని మరింత ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.     

మరిన్ని వార్తలు