టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు 

27 Feb, 2021 10:08 IST|Sakshi
తిమ్మరాజుపాలెంలో సచివాలయానికి పచ్చరంగు- ఏడుగుండ్లపాడులో.. 

పర్చూరు: అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘పచ్చ’ రంగులు వేసుకొని తరించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోను వారి ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ కార్యాలయానికి గురువారం పచ్చ రంగు వేసేశారు.  విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శుక్రవారం పచ్చ రంగును తొలగించి తెలుపు రంగు  వేయించారు.

ఏడుగుండ్లపాడులో..
ఒంగోలు: సచివాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు నానా యాగీ చేసి కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందడం, శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటూ టీడీపీ నేతలు గ్రామ సచివాలయం బోర్డుకు పసుపు రంగులు వేశారు.
చదవండి:
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్‌!
బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు