ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. చూశారా

28 Mar, 2024 14:28 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. 

ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా

  • ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
  • ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే)
  • ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే.
  • ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్‌లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్
  • ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే
  • ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో శ్రీరామ నవమి
  • ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే
  • ఏప్రిల్ 21- ఆదివారం
  • ఏప్రిల్ 27- నాలుగో శనివారం
  • ఏప్రిల్ 28- ఆదివారం

బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

Election 2024

మరిన్ని వార్తలు