విషయాలను మరచి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు

17 Jan, 2024 19:40 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్‌ సభలకు సీఎం జగన్‌ వెళ్ళలేదంటూ ఈనాడు విషం చిమ్ముతోంది. నిజానికి మొత్తం 29 రాష్ట్రాల్లో దావోస్‌కు వెళ్లింది కేవలం ముగ్గురు ముఖ్య‌మంత్రులే. గతంలో ఐదు సార్లు దావోస్ వెళ్లానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఒక్క విదేశీ పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు.

చంద్ర‌బాబు.. నేనే తెచ్చినట్లు గొప్ప‌గా చెప్పుకునే కియా ప‌రిశ్ర‌మ కూడా ప్ర‌ధాని మోదీ కొరియా ప‌ర్య‌టన‌లో ఉన్నప్పుడు చేసిన సూచ‌న మేర‌కు ఆ కంపెనీ ఏపీకి వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ కంపెనీ తీసుకు వచ్చింది నేనే అంటూ బాబు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు.

సీఎం జగన్ దావోస్‌ ఇప్పుడు దావోస్ సభలకు వెళ్లకపోయినా.. ఇప్పటి వరకు తన పాలనలో రాష్ట్రంలో రూ. 30000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 26.29 లక్షలమంది ఉపాధి పొందుతున్నారనే విషయం తెలిసిందే.

చంద్రబాబు పాలనలో ఉన్నన్ని రోజులు (దిగిపోయేనాటికి) రాష్ట్రానికి వచ్చిన ఎంఎస్ఎంఈల సంఖ్య 1.93 లక్షలు మాత్రమే. దీంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈలు రెట్టింపు అని స్పష్టమవుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే 2023 మార్చిలో జరిగిన విశాఖ సమ్మిట్‌లో మాత్రమే పారిశ్రామిక వేత్తలు రూ. 13  లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. ఫోర్టుల అభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక వృద్ధిలో దూసుకెళ్తోందన్న విషయం పారదర్శకంగా కనిపిస్తున్నాయనే.. విషయాలన్నీ తెలిసినా విష ప్రచారాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

>
మరిన్ని వార్తలు