సుప్రీం కోర్టు తీర్పు.. ఈపీఎఫ్‌ఓ మార్పులు

15 Dec, 2023 21:05 IST|Sakshi

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ ‘తరచూ అడిగే ప్రశ్నావళి’ (FAQ)లో మార్పులు చేసింది. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి అధిక పెన్షన్ అమలుపై సవరించిన ఎఫ్‌ఏక్యూ సెట్‌ను విడుదల చేసింది. 

పెన్షన్‌ బకాయిలను చందాదారులకు చెల్లిస్తారా లేదా అధిక చందా డిమాండ్‌కు సర్దుబాటు చేస్తారా అన్న ప్రశ్నకు సవరించిన ఎఫ్‌ఏక్యూలలో ఈపీఎఫ్‌ఓ బదులిచ్చింది. పెన్షన్‌ బకాయిలను ప్రస్తుత పద్ధతిలోనే టీడీఎస్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను నియామళిని అనుసరించి చెల్లించనున్నట్లు పేర్కొంది. 

మరోవైపు పింఛను లెక్కింపు సూత్రాన్ని, అలాగే ఉద్యోగుల పింఛను పథకం-1995 కింద అధిక పింఛను కోసం ఉమ్మడి దరఖా​స్తు సందర్భంలో అవసరమైన ధ్రువపత్రాల జాబితాను  ఈపీఎఫ్‌వో నూతన ఎఫ్‌ఏక్యూలలో మరోసారి స్పష్టం చేసింది. అధిక పెన్షన్‌కు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయడానికి గత జూన్‌లో కూడా ఈపీఎఫ్‌ఓ ​​ఇలాంటి ఎఫ్‌ఏక్యూ సెట్‌ను జారీ చేసింది.

ఇదీ చదవండి: విశాఖ నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్ 

అయితే అధిక పెన్షన్‌ను ఈపీఎఫ్‌ఓ ఎప్పటి నుంచి అమలు చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ఈ అధిక పెన్షన్‌ ప్రక్రియ ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన దశలో ఉంది.  వచ్చే జనవరి నాటికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా అధిక పెన్షన్ కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు