గూగుల్‌ అసిస్టెంట్‌ పాడే కరోనా వ్యాక్సిన్‌ పాట విన్నారా...!

8 May, 2021 17:00 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి దేశాలను కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపివేస్తోంది. కరోనా వైరస్‌ ఎదుర్కొవడానికి పలు దేశాలు చేసిన పరిశోధనలతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. కాగా కొంతమందికి వ్యాక్సిన్‌పై అనుమానం ఉండడంతో  వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌లో పాల్గొనేందుకు కోసం గూగుల్‌ తన వంతుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఒక ప్రత్యేక ఫీచర్‌ను తీసుకువచ్చింది.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని గూగుల్‌ అసిస్టెంట్‌ వ్యాక్సిన్‌పై  అపోహలును తీర్చుతూ ఒక పాటను పాడేలా గూగుల్‌ ఏర్పాటు చేసింది. మీరు మీ ఫోన్లో ‘ఓకే గూగుల్‌.. సింగ్‌ ది వ్యాక్సిన్‌ సాంగ్‌’ అనగానే గూగుల్‌ అసిస్టెంట్‌ పాట పాడుతుంది. ఈ పాటతో ప్రజలను వ్యాక్సిన్‌ చేయించుకునేలా ప్రోత్సహిస్తోందని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాటలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను , వ్యాక్సిన్‌ తయారీదారులను కీర్తిస్తూ లిరిక్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో గూగుల్‌ అసిస్టెంట్‌ పాడే వ్యాక్సిన్‌ పాట  వైరల్‌గా మారింది. ఈ పాటను విన్న ఓ నెటిజన్‌ ‘నేను వెంటనే వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకుంటాన’ని తెలిపాడు. 

చదవండి: Fact Check: 5జీ టెస్టింగ్ వ‌ల్లే కోవిడ్ సెకండ్ వేవ్‌..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు