టాటా సన్స్‌ మెగా ఐపీవో!

9 Mar, 2024 02:10 IST|Sakshi

అంచనా విలువ రూ. 11 లక్షల కోట్లు 

ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లు!

ఏడాదిన్నర కాలంలో లిస్టింగ్‌ తప్పనిసరి

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా సన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ స్పార్క్‌ క్యాపిటల్‌ పేర్కొంది. టాటా గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ హోల్డింగ్‌ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్‌ కంపెనీల ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్‌ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది.

అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ కావలసి ఉన్నట్లు స్పార్క్‌ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్‌ హోల్డింగ్‌ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్‌ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్‌ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్‌ను సాధించే వీలున్నట్లు పేర్కొంది.  
విలువ జోడింపు
అన్‌లిస్టెడ్‌ పెట్టుబడులతో పలు  మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్‌ క్యాపిటల్‌ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్‌ తదితర ఆధునికతరం
విభాగాలలోకి టాటా గ్రూప్‌ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్‌.. చిప్‌ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్‌ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్‌ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్‌ లిస్టెడ్‌ కంపెనీలు, ప్రిఫరెన్స్‌ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది.  

టీసీఎస్‌ బలిమి
టాటా సన్స్‌ విలువలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్‌ ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం టాటా సన్స్‌ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్‌ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్‌ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్‌ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ 28 శాతం, రతన్‌ టాటా ట్రస్ట్‌ 24 శాతం, సైరస్‌ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి.

Election 2024

మరిన్ని వార్తలు