స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!

17 Jun, 2021 18:36 IST|Sakshi

దేశంలో మరోసారి టీవీల ధరలకు​ రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్‌ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. 

పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. 

హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4  శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి.

చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం

మరిన్ని వార్తలు