ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!

18 Dec, 2023 20:20 IST|Sakshi

డిసెంబర్‌ 7న ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ సంస్థ యూకో బ్యాంక్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా యూకో బ్యాంక్‌కు చెందిన 41వేల అకౌంట్‌లలో పొరపాటున రూ.820 కోట్లు జమయ్యాయి. వాటిల్లో రూ. 705.31 కోట్లు రికవరీ అయ్యాయి. 

 బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్‌లో సాంకేతిక లోపంతో జరిగిన నిధుల బదిలీలో రూ.114.69 ఇంకా రికవరీ కాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ స‌హాయ‌మంత్రి భ‌గ‌వ‌త్ క‌ర‌ద్ లోక్‌ సభ సమావేశాల్లో లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.   

ఈ ఘ‌ట‌న‌కు కారణమైన యూకో బ్యాంక్‌ ఉద్యోగుల్ని గుర్తించింది.  గుర్తించలేని ఇత‌ర వ్య‌క్తుల‌పై సీబీఐ వ‌ద్ద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ఇక ప‌శ్చిమ బెంగాల్‌, క‌ర్నాట‌క‌లోని 13 ప్ర‌దేశాల్లో సీబీఐ సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్‌ల‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

>
మరిన్ని వార్తలు